దేవ దేవుని సన్నిధిలో

దేవ దేవుని సన్నిధిలో

సముహముగా ఉన్నదెవరో

అధిపతి ప్రభు యేసుని సైన్యములో

నిలచిన ఈ ధీరులెవరో (2) ||దేవ||

1

ఒక్క తలాంతో రెండు ఉన్నవో

ఐదు ఉన్నను వాడినవారు

చిన్న పనిలో పెద్ద పనిలో

ఇచ్చినట్టి పనిని చేసినవారు ||దేవ||

2

అడవులలో పయనించి

ప్రభుని ప్రేమ పంచినవారు

కలిమిలోను లేమిలోను

పట్టుదలగా ప్రార్థించువారు ||దేవ||

3

ఒంటరితనం పేదరికంలో

లాజరులా నిలబడిరి

యాచించిన పోషించిన

విశ్వాసము వీడనివారు ||దేవ||

4

జాతులన్నియు గోత్రాలన్నియు

భాషలన్నియు మాట్లాడువారు

సిలువ క్రింద యేసు రక్తంలో

మంచి పోరాటం పోరాడినారు ||దేవ||

ఈ పాటను వినడానికి క్రింది వీడియో చూడండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు